ప్రస్తుతం మెహ‌ర్ ర‌మేష్ ఆశ‌ల‌న్నీ షాడోపైనే. ఈ సినిమా అటూ, ఇటూ అయితే త‌న భ‌విష్య‌త్తు ఏమిటో త‌న‌కే అర్థం కావ‌డం లేదు. మ‌రోవైపు ర‌వితేజ తో చేద్దామ‌నుకొన్నా ప‌వ‌ర్ ప‌ట్టాలెక్క‌డం అనుమాన‌మే. దాంతో త‌ర‌వాతి సినిమా కొసం ఇప్పుడే ప్లాన్‌లు వేసేస్తున్నాడు. మెహ‌ర్ ర‌మేష్ కీ మెగా కుటుంబానికీ బంధుత్వం ఉంది. అందుకే ఆ కుటుంబంలో క‌నీసం ఒక్క‌రినైనా త‌న వైపుకు తిప్పుకోవాల‌నేది మెహ‌ర్ ఆలోచ‌న‌. ఇప్ప‌టికే బ‌న్నీ కోసం ఓ క‌థ సిద్ధం చేసినట్టు స‌మాచారం. షాడో ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌కు బ‌న్నీని ప్ర‌త్యేక అతిథిగా పిల‌వాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఒక వేళ బ‌న్నీకి వీలు లేక‌పోతే... చ‌ర‌ణ్‌తో అయినా సినిమాకి రెడీ అవుతున్నాడు. మ‌రి మెహ‌ర్ స్కెచ్‌కి ఈ మెగా హీరోల్లో ఎవ‌రు ప‌డ‌తారో? 

మరింత సమాచారం తెలుసుకోండి: