తన సహజనటనతో తెలుగు వారి హృదయాలను దోచుకున్న నటి జయసుధ. అందంతోనే కాదు అభినయం తోనూ జయసుధ సినీ అభిమానులను మెప్పించింది. సహజ నటిగా కితాబు అందుకుంది. వివాహం తరువాత, రాజకీయరంగం లోకి ప్రవేశించినా జయసుధ సినిమాలను విడిచి పెట్టలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహిస్తున్నా, సినిమాలతోనూ జయసుధ బిజీగానే ఉంది. కాగా, జయసుధ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జయసుధను వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తున్నట్లు తెలుస్తొంది. అందుకే జయసుధ పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టం పడటం లేదు. అలాగే సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నా ఆలస్యంగా వచ్చి, తొందరగా వెళ్లి పొతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సహజనటి గా ఎంతో పేరు గడించిన జయసుధ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం..!      

మరింత సమాచారం తెలుసుకోండి: