ఎట్టకేలకు రాష్త్ర ఎం.పీలకు పదవుల పందేరం, మీరూ మకు ముఖ్యమనే సందేశం, అని చూడడానికి బాగనె ఉన్నా, ఎనిమిది ఏళ్ల యు.పీ.ఎ హయంలో ఇప్పటికి రాస్త్రానికి కొద్దో గొప్పో న్యాయం జరిగిందని భావిస్తున్నారు, కాని ఎంత సంకీర్ణ ఒతిల్లున్న, ఇప్పటి వరకు మనకి ఇంత గౌరవం లభించలేదు. కాంగ్రెస్ పార్టీకి భారీగా ఎం.పీలను పంపించిన మన ఫై మొదటిసారి కరుణించినందుకు ఒకింత సంతోషమే అయినా ఇది చాలా అలస్యమనే భావన విశ్లేషకులలో ఉంది. తమకు తెలంగాణా, సమైక్య ఆంధ్ర పేరిట ఇబ్బంది కలిగించని వారికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ ఆదిస్థానం తన మనసులో ఏముందో చెప్పకేనే చెప్పింది. కాని ప్రస్తుత ప్రభుత్వానికి మహా అయితే మరో ఏడాదిన్నర ఉందంతే. ఇప్పుడు మన రాష్ట్రం ఫై ఇంతగా ప్రేమ కురిపించడం ఒకింత ఆశ్చర్యమే! కేవలం మళ్లీ అధికారానికి మేం అర్హులం, జగన్ను నివారించాం, అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించాం, అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చాం అన్ని చెప్పుకోడానికి తప్పితే, దీని వల్ల మనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే ఉన్న మంత్రులు మనకు ఎం సాధించి పెట్టారో అందరికి తెలిసిందే, ఇంకో ఏడాదిలో మాత్రం అద్భుతలు జరుగుతాయని మనం పొరపాటుగా అయినా అనుకోలేము. క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఆడుతున్న డ్రామాగా పరిగణించాలి తప్పితే సోనియాకు మన మీద హటాత్తుగా ఇంత ప్రేమ కలిగిందనలెం, అంతే ఉంటె గత మూడేళ్ళుగా మన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారు అయినప్పుడ్డు ఎందుకు పట్టించేకోలేదు సుమీ! 

మరింత సమాచారం తెలుసుకోండి: