విజయ సంస్థ ప్రారంభించిన తొలి చిత్రం ‘షావుకారు’ నుంచి చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ’ వరకు ప్రతి చిత్రానికీ పనిచేసిన నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి. నాట్యానికి పుట్టిల్లయిన కూచిపూడి గ్రామంలో 11.12.1925న ఆయన జన్మించారు. ఆయన తొలి చిత్రం ‘భక్త తులసీదాస్’.  2004లో కన్నుమూసిన ఆయన సుమారు 250 సినిమాకు డ్యాన్స్ డైరక్టర్ గా వ్యవహరించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలకు ఆయన పనిచేశారు. మల్లీశ్వరి, పాండవనవాసం, పూజాఫలం, సిరిసిరిమువ్వ, శ్రీ కృష్ణార్జునయుద్దం, నవరాత్రి, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. . 

మరింత సమాచారం తెలుసుకోండి: