ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా. పెళ్లయిన తరవాత సినిమాలు చేయడం తగ్గించేసింది జెనీలియా. ఈ విషయం గురించి రితేష్ మాట్లాడుతూ... ‘జెనీలియా మంచి నటి. గొప్ప హీరోయిన్. ఇన్నాళ్లూ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఆమె నటించకపోతే మా ఇంటి పరిస్థితేంటి? ఇల్లు ఎలా గడస్తుంది? నాకేమో సినిమా అవకాశాలు రావడం లేదు. వచ్చినా చిన్నచిన్న అవకాశాలే. ఇప్పుడు జెనీలియా కూడా సినిమాలు చేయడం మానేస్తే మరి, నా ఫోన్ బిల్లుకి డబ్బులు ఎవరిస్తారు?’ అంటున్నాడు రితేష్. ఇదేంటి, ఇలా మాట్లాడుతున్నాడు అనిపిస్తోందా... ఈ మాటల్లో ఒక మర్మం ఉందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. ‘మాకు సినిమాలు రాకపోయినా ఫర్వాలేదు, డబ్బుకి లోటు లేదు. జెనీలియాకు అవకాశాలొస్తే సినిమాల్లో మళ్లీ నటిస్తుంది’ అని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: