వరస హిట్లతో అల్లరి నరేష్ ఎప్పడో గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడు కూడా మంచి వసూళ్ళు సాధిస్తోంది. అల్లరి నరేష్ కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదల చేసిన ఈ సినిమా మొదటి మూడు రోజులలోనే మూడు కోట్లు వసూలు చేసి మార్కెట్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. కాగా, ఈ సుడిగాడు సినిమా విదేశాలో కూడా మంచి వసూలు సాధిస్తుంది. అల్లరి నరేష్ కు కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తోంది. సుడిగాడు సినిమాను అమెరికాలో 30 థియేటర్లలలో విడుదల చేశారు. అక్కడి ఈ సినిమా మొదటి రోజున లక్ష అమెరికన్ డాలర్లు వసూలు చేసి అల్లరి నరేష్ సినిమాలలో చరిత్ర సృష్టించింది. ఇటీవల కాలంలో మొదటి రోజున ఈ ఫీట్ సాధించిన గబ్బర్ సింగ్, ఈగ, జులాయి సినిమాల సరసన నిలిచింది. అలాగే ఈ సుడిగాడుని బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ దేశాలలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సుడిగాడు మంచి కలెక్షన్లు రాబట్టుకుంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: