బ్యానర్ : మెగా సూపర్ గుడ్ మూవీస్,   చిత్రం : మాస్క్ నిర్మాత : పారిస్ జైన్, దర్శకత్వం : మిష్కిన్ నటీనటులు : జీవా, పూజా హెగ్డే, నాజర్, తదితరలు   రంగం సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న జీవా ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మార్కెట్ పెంచుకోవడానికి కృషి చేస్తున్న జీవా తాజాగా మాస్క్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దక్షిణాదిలోనే తొలి సూపర్ హీరో సినిమా అంటూ ప్రచారం చేసుకున్న మాస్క్ చిత్రం సంగతి చూద్దాం... చిత్రకథ :  జులాయిగా తిరిగే ఆనంద్ (జీవా)కు కింగ్ ఫూ అంటే ఇష్టం. అలాగే తనకు ఆ విద్య నేర్పే గురువు అంటే పంచ ప్రాణాలు. కాగా, జీవా ఒక పోలీస్ అధికారి అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అమ్మాయిని ఆకట్టుకోవడానికి మాస్క్ మ్యాన్ గెటెప్ లో వెళతాడు. అక్కడ ఒక హత్యానేరం లో చిక్కుకుంటాడు. ఆ హత్యా నేరం నుంచి ఎలా భయట పడ్డాడు..? ఆసలు హంతకులకు, కింగ్ ఫూ గురువుకు సంబంధం ఏమిటి అనేదే చిత్రకథ. నటీనటుల ప్రతిభ : జీవా తన కిచ్చిన పాత్రలో బాగా నటించాడు. కుంగ్ ఫూ విద్యార్థి గా చక్కగా సరిపోయాడు. ఫైట్స్ కూడా బాగా చేశాడు. పూజా హెగ్డే అందంగా ఉంది. మిగిలిన వారు తమ తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ ఓకే. అయితే సినిమాలో చాలా భాగం నైట్ ఎఫెక్ట్ లో సాగుతుంది. కళ్లను బాగా శ్రమపెడుతుంది. మ్యూజిక్ బాగోలేదు. ఒక్క పాట కూడా ఆకట్టుకునే విధంగా లేదు. మాటలు సో సోగా ఉన్నాయి. నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. అయితే దర్శకుడు చాలా ఆ ఖర్చు సరిగ్గా వినియోగించుకోలేక పోయాడు. అసలు సినిమా ను ఏ విధంగా రూపొందించాలో తనకు తానే తేల్చుకోలేకపోయాడు. కుంగ్ ఫూ నేపధ్యంలోనా.. లేక సూపర్ హీరో నేపధ్యంలోనా.. లేక ప్రేమ కథ గా సినిమాను మలచాలనుచుకున్నాడా అనేది నిర్ణయించుకోలేక పోయాడు. పైగా ఈ మూడు అంశాలలోనూ వేలు పెట్టి ఈ మాస్క్ సినిమాను దేనికీ చెందకుండా చేశాడు. హైలెట్స్, డ్రాబ్యాక్స్ గురించి రాయడం అనవసరం. చివరగా.. : పరమ బోరింగ్ సినిమా..      Mask English Review: http://bit.ly/OxJd0R   Srimannarayana Movie Review: http://bit.ly/SWYRWx Mask Articles: http://bit.ly/Q45xky Mask  Images: http://bit.ly/O5NA2c   Mask Videos: http://bit.ly/Q472za 

మరింత సమాచారం తెలుసుకోండి: