నయనతారకు కాస్త అసహనం ఎక్కువైంది. ఏ విషయం మీద అంటారా... అదే, తన గత ప్రేమకథల మీద. ఈ మధ్య నయన ఎక్కడ కనిపించినా సరే విలేకరులు సంధిస్తున్న ప్రశ్న... ‘మీ ప్రేమయాణాల సంగతేంటీ’ అని. ఇదే ప్రశ్న ఆమెని చాలా ఇబ్బంది పెడుతోందని సన్నిహితులతో వాపోతోంది. ‘నిన్నటి రోజు గురించి నేను ఈ రోజు ఆలోచించను. గతంలో ఏం జరిగినా అది జరిగిపోయింది కాబట్టి, దాన్ని మనం మార్చలేం కాబట్టి ఆ విషయాను అక్కడితో వదిలేయాలి. నేను నా వ్యక్తిగత జీవితంలోని గతాన్ని ఎప్పుడో వదిలేశాను. కానీ, మీడియా వారు మాత్రం నన్ను ఇంకా గతం నుంచే చూస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా పాత కథలనే మళ్లీ మళ్లీ తవ్వుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆత్రం ప్రజలకు ఎందుకు ఉంటుంది? దయచేసి నన్ను ఇలా వదిలేస్తే బాగుంటుంది’ అని ఇటీవలే ముంబైలోని వాపోయిందట. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన నయనతారకి విలేకరులు తారసపడ్డప్పుడు ఇలా స్పందించిదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: