భూమిక మళ్లీ తెరముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. చాలా విరామం తరువాత జగపతి బాబుతో కలసి ‘ఏప్రిల్ ఫూల్’ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం కోసం భూమిక ఏకంగా పది కిలోలు బరువును తగ్గించుకుందట. ఈ మధ్య కాలంలో చాలా విరామం రావడంతో కాస్త బరువెక్కిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా అనుకోగానే రెండు నెలల ముందునుంచే డైట్ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ప్రతీరోజూ యోగా క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించింది. మొత్తానికి పది కిలోలు తగ్గిందట. మరి, తన నటనతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: