గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నలుగురు అనుచరులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు కర్నాటకలోని హిండలగా జైల్లో జ్ఞాన ప్రకాశం, సియోన్, మాడయ్య, జితేందర్‌లు శిక్ష అనుభవిస్తున్నారు. 1993లో కర్నాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో పాలార్ వద్ద మందు పాతరను పేల్చారు.  ఈ ఘటనలో 21 మంది పోలీసులు మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. తమకు క్షమాభిక్ష పెట్టాలని వారు 2004లో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసారు. వారి విజ్ఞప్తిని రాష్ట్రపతి తిరస్కరించారు.  ఉరిశిక్ష పడిన నలుగురు బెల్గాంలోని హిండల్గ కారాగారంలో నిర్బంధంలో ఉన్నారు. ఉరితీతకు సమయం దగ్గర పడుతోంది. ఈ జైలులో ఒక దోషిని చివరి సారిగా 1983లో ఉరితీశారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఉరి అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దోషి చనిపోయే వరకూ ఎలా ఉరితీయాలనే దానిపై జైలు సిబ్బందికి తర్పీదు కూడా పూర్తయింది. రిహార్సల్స్ కూడా చేశారు. ఏ రోజు ఏ సమయానికి ఉరి తీయాలో మైసూర్ సెషన్స్ కోర్టు నేడు నిర్ణయించబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను అందుకునేందుకు జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే మైసూర్ చేరుకున్నారు. కోర్టు ఆదేశించడం ఆలస్యం ,ఏ క్షణంలోనైనా నలుగురు దోషులను ఉరి కంభం ఎక్కించడానికి జైలులో రంగం సిద్ధం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: