హీరో గోపీచంద్ తాజాగా ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించాడని సమాచారం. దీనికి సంబంధించి వివరాలేవీ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. దేవ కట్టా దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కథలో కథనంలో కొత్తదనం తనకి నచ్చి ఈ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధపడ్డట్టు ఫిల్మ్ నగర్ టాక్.  ఈ చిత్రం ఉగాది నాడు ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ రెండు చిత్రాలు చేస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక చిత్రం, ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ తో కలసి మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: