అవును మరి, ఏడాదిపాటు ఓ చిత్రంకోసం ప్రయాణిస్తే ఎలా అవ్వకుండా ఉంటారు? మరైతే, ఎన్నో సినిమాల్లో అన్నాదమ్ములుగా నటించేవాళ్లు ఆ తరవాత అన్నాదమ్ములు అయిపోతున్నారా అంటే కాకపోవచ్చు. కానీ, ఈ చిత్రం మాత్రం ప్రత్యేకం. అదే సీతమ్మ వాకిట్లో. నాలుగేళ్లపాటు సాగిన సినిమా ఇది. ఈ సినిమాకోసం మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా నటించారు. తెలుగింటి లోగిళ్లలో ఉండే అన్నదమ్ముల అనుబంధాలు చూపిన చిత్రం ఇది. ఇది చిత్రంగానే కాదు... నిజంగానే ఇద్దరు వ్యక్తుల్లోనూ అనుబంధాలను పుట్టించింది. వాళ్లిద్దరే వెంకటేష్, మహేష్ బాబు. ఇందులో పెద్దోడు, చిన్నోడుగా కనిపించిన వీళ్లిద్దరూ నిజ జీవితంలోనూ అలాగే అయిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లిద్దరే ప్రకటించారు. ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ పండుగ నిన్న జరిగింది. ఇందులో వెంకటేష్ మాట్లాడుతూ... ఇన్నాళ్లూ నాకు అన్నయ్య ఉన్నాడు. తమ్ముడు లేడే అనుకునేవాణ్ని. ఇప్పుడు మహేష్ బాబు రూపంలో తమ్ముడు దొరికాడు. చాలా సంతోషంగా ఉంది... అన్నాడు వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: