పెద్ద హీరోల సినిమా అంటే... చిన్న సీను కూడా ఖరీదుగానే ఉంటుంది, అలాంటిది ఐటెమ్ సాంగ్ అంటే ఏ రేంజిలో ఉండాలి? ఇటీవలి కాలంలో చిన్నా చితకా చిత్రాల మొదలు భారీ హీరోల సినిమాల వరకూ ఐటెమ్ సాంగుల గోల ఎక్కువైపోయింది. శ్రుతి మించిన శ్రుంగారం, అందాల ఒలకబోతలు ఒక ఎత్తయితే... అందుకు ఖరీదైన సెట్లు వేయడం మరో ఎత్తు. ఇప్పుడు ఇలాంటి ఖరీదైన స్పైసీ ఐటెమ్ సాంగ్ మరొకటి రాబోతోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం బాద్షా, ఇందులో ఓ ఐటెమ్ సాంగ్ పెట్టారు. దూకుడు సినిమాలో ఐటెమ్ సాంగ్ లో మెరిసిన మీనాక్షీ దీక్షిత్ ఇందులోనూ అందాలను ఆరబోయనుంద. ఈ పాటలో వాడిన దుస్తులు మొదలుకొని సెట్ వరకూ భారీగానే ఖర్చుపెట్టార. సుమారు రెండు కోట్ల రూపాయలను... కేవలం ఈ ఒక్కపాటకోసమే ఖర్చుపెట్టారంటే... దీన్ని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో ఊహించుకోవచ్చు. ఒక్క పాటే ఇలా ఉంటే మరి, సినిమా ఏ రేంజిలో ఉండబోతుందో? 

మరింత సమాచారం తెలుసుకోండి: