ఆస్ట్రేలియాపై జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన బౌలర్‌ పర్వేజ్‌రసూల్‌ 2009లోనే వార్తల్లోని వ్యక్తిగా నిలిచాడు. అయితే పేలుడు పదార్ధాలు కలిగి ఉన్నాడనే అనుమానంతో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో అతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే అది గతం. ప్రస్తుతం ఈ కాశ్మీరీ ఆఫ్‌ స్పిన్నర్‌ చెన్నైలో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఇప్పుడు అందరి మన్ననలు పొందుతున్నాడు. జన్మదినానికి ఒక రోజు ముందే ఆస్ట్రేలియాపై 7 వికెట్లు తీసుకొని వార్మప్ మ్యాచ్‌లో తన ఉనికిని చాటుకున్నాడు. పర్వేజ్‌రసూల్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ హెడ్‌ కోవాన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. రసూల్‌ మంచి నియంత్రణతో బౌలింగ్‌ చేశాడని, కొంత టర్న్‌ కూడా సాధించాడని, అటువంటి బంతులు వేసే బౌలర్‌ ఎవరైనా విక్కెట్లు తీసుకోగలడని కోవాన్‌ చెప్పాడు. రసూల్‌ దెబ్బతోనే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే కుప్పకూలిందన్నారు. తాను చాలా కాలంగా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో ఆడుతున్నానని, ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చెయ్యాలనే ముందస్తు ఆలోచనతో బ్యాటింగ్‌కు దిగుతున్నానని, బ్యాటింగ్‌లో రిథమ్‌ రాబడుతానన్నారు. గుడ్ లక్ పర్వేజ్!! 

మరింత సమాచారం తెలుసుకోండి: