విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీల మోత మోగనుంది. వచ్చే నెల నుండి విద్యుత్ వినియోగదారులపై మరింత అదనపు బారం పడనుంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి 753కోట్ల రైపాయలను సర్దుబాటు చార్జీలను వినియోగదారులనుండి వసూలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. ఫలితంగా ఏప్రీల్ మాసం నుండి మూడు నెలల పాటు విద్యుత్ వినియోగదారులకు యూనిట్ పై అదనంగా 62పైసలు బారం పడుతుంది. 982కోట్ల రూపాయలను ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలుకు అనుమతించాలని డిస్కాంలు తొలుత ప్రతిపాదించాయి. బహిరంగ విచారణ నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత 753కోట్ల రూపాయలు సర్ చార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కాగా ఇప్పుడిచ్చిన అనుమతితో ఏపిఇర్ సి 11,691కోట్ల రూపాయల మేర ఇందన సర్దుబాటు చార్జీల వసూళ్లకు గత మూడేళ్లలో అనుమతినిచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: