భారతీయ జర్నలిస్టుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ‘టైమ్ ఇంటర్నేషనల్’ పత్రికకు ఎడిటర్ గా ఎన్నారై బాబీ ఘోష్ ఎంపికయ్యాడు. టైమ్ పత్రికా చరిత్రలో అమెరికాయేతర వ్యక్తి సంపాదకునిగా నియమితులవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ మార్తా నెల్సన్, మేనేజింగ్ ఎడిటర్ రిక్కి స్టెన్జ్‌ల్ ఆ పత్రిక సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. సర్వ సమావేశంలో బాబీను ఈ పదవిలో నియమించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాబీపై ఆ పత్రిక యాజమాన్యం ప్రశంసల జల్లు కురిపించింది. 1998లో టైమ్ లో పాత్రికేయునిగా చేరిన బాబీ అంచలంచెలుగా ఎదిగిన క్రమాన్ని గుర్తు చేశారు. ఆయన ఎంత ఉన్నత స్థితికి చేరిన అతని రచన శైలీ భాషా ప్రావీణ్యం, వృత్తి పట్ల కనబరిచే అంకితభావం మంత్రముగ్ధులను చేస్తుందని వారు కీర్తించారు. ఇటివలీ కాలంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ కథనాయకుడు అమీర్‌ఖాన్, చెస్ క్రీడా రంగంలో రారాజు విశ్వనాథ్ ఆనంద్‌లపై భారత కథలు పేరిట ఆయన చేతుల నుంచి జాలువారిన స్టోరీలకు మంచి పబ్లిసిటీ వచ్చిందని అని వారు కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: