హైవేల మీద కారు లేదా టోల్ ఫీజు విధించే ఇతర వాహనాలలో ప్రయాణం చేసినపుడు టోల్ గేట్ల దగ్గర ఫీజు చెల్లిస్తామన్న విషయం తెలిసిందే. సిబ్బంది వాహనానికి చెల్లించిన ఫీజుకు టోల్ గేట్ రశీదును ఇస్తారు. కానీ చాలామంది ఆ రశీదులో ఉన్న విషయాల గురించి చదవకుండానే రశీదును బయట పాడేయటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కొంతమంది ప్రయాణం పూర్తయిన తరువాత అన్ని టోల్ గేట్ల దగ్గర టోల్ ఫీజు ఎంత విధించారో తెలుసుకోవటానికి మాత్రమే టోల్ గేట్ రశీదులను ఉపయోగిస్తారు. 
 
కానీ టోల్ గేట్ రశీదు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. టోల్ గేట్ రశీదులు కేవలం ప్రయాణ సమయంలో వాహనానికి చెల్లించిన రశీదు మాత్రమే కాదు. ఈ రశీదు వలన టోల్ ఫీజు చెల్లించిన వాహనంలోని ప్రయాణికులు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు పొందగలరు. టోల్ గేట్ రశీదు వెనుక ప్రయాణ సమయంలో అత్యవసర వైద్య సహాయం అవసరమైన పక్షంలో కాల్ చేయాల్సిన నంబర్ ఉంటుంది. 
 
వైద్యసహాయం అవసరమైతే ఆ నంబర్ కు కాల్ చేసిన అతి తక్కువ సమయంలో ఆంబులెన్స్ వచ్చి వైద్యసహాయం అందిస్తుంది. వాహనం టైర్ పంక్చర్ అయినా లేదా ఇతర సమస్యల కారణంగా వాహనం ఆగిపోయినా రశీదులో ఉన్న నంబర్ కు ఫోన్ చేస్తే టోల్ గేట్ సిబ్బంది వీలైనంత తక్కువ సమయంలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తారు. కొన్ని సందర్భాలలో వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ అయిపోవటం వలన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 
 
అలాంటి సందర్భాలలో 5 లీటర్ల నుండి 10 లీటర్ల వరకు పెట్రోల్ లేదా డీజిల్ టోల్ గేట్ సిబ్బంది అందిస్తారు. సరఫరా చేసిన డీజిల్, పెట్రోల్ కొరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ గేట్ల దగ్గర వాహనదారులు చెల్లించే ఫీజు వలన ఈ సేవలు పొందటానికి అర్హులు అవుతారు. ఈ విషయాల గురించి తెలీక చాలా మంది టోల్ గేట్ రశీదులను చించి పారేస్తూ ఉంటారు. కానీ ప్రయాణ సమయంలో ఏర్పడే చాలా సమస్యలకు టోల్ గేట్ రశీదులో ఉండే ఫోన్ నెంబర్ల ద్వారా పరిష్కారం పొందవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: