ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు నెలలుగా ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత సమస్య తో భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపాధి కరవై తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్నారు. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి . దీంతో మనస్తాపం చెంది ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు  ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ అధికార వైసిపి పార్టీపై విమర్శలు కగుప్పిస్తున్నాయి . రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడానికి కారణం అధికార వైసిపి ప్రభుత్వ  పాలన అసమర్థతే అంటూ విమర్శలు గుప్పిస్తున్నయి  ప్రతిపక్షాలు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 



 అంతేకాకుండా వైసిపి నాయకులు అందరూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అందుకే రాష్ట్రంలో ఎవరికి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రంలో ఇసుక  కొరత  సమస్యను  తీర్చాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి  ప్రతిపక్ష పార్టీలు. ఇప్పటికే టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒకరోజు దీక్ష చేపట్టగా...  తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖ సెంట్రల్ పార్క్ లో లాంగ్ మార్చ్  నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నేతలు కూడా ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇసుక కొరత సమస్యను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. 



 అయితే ఇప్పటి వరకు ఇసుక కొరత సమస్యపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వైసిపి నేతలు వాటికి కౌంటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు ఇసుక కొరత సమస్యపై ముఖ్యమంత్రి జగన్ మాత్రం స్పందించలేదు. అయితే తాజాగా తొలిసారి ఇసుక కొరత పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత  పై స్పందించిన జగన్ రాష్ట్రంలో  త్వరలో  ఇసుక సమస్య తీరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారుతో  ఇసుక కొరత సమస్య పై సమీక్ష నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కొన్ని  రోజులుగా ఊహించని విధంగా రాష్ట్రంలో వరదలు ఉన్నాయని... దీంతో అన్ని నదుల వరద నీటితో పోటెత్తడంతో  రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో  కేవలం 61 రీచ్ లు  మాత్రమే పని చేస్తున్నాయని జగన్ తెలిపారు. ఇసుక కోసం లారీలు ట్రాక్టర్లు వెళ్లలేని స్థితి నెలకొందని.. అందుకే ఇసుక తీయడం లేదంటూ జగన్ తెలిపారు. అయితే గత టీడీపీ హయాంలో   ఇసుక మాఫియా నడిచిందని ఇసుక ఉచితమని చెప్పి మాఫియా నడిపించారంటూ  జగన్ ఆరోపించారు. అయితే ఇసుక సమస్య తాత్కాలికామేనన్న  జగన్.. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుస్తామని స్పష్టం చేశారు. కాగా  ప్రజలకు మేలు చేసేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: