ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలో కలవబోతున్నారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్, చిరంజీవి ఇప్పటివరకు కలవలేదు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కొంతమంది జగన్ ను కలవటానికి అపాయింట్ మెంట్ అడిగినప్పటికీ సీఎం జగన్ పరిపాలనా వ్యవహారాలలో విశ్రాంతి లేకుండా ఉండటంతో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. 
 
ప్రస్తుతం చిరంజీవి సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా సినిమాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేకంగా షోలు వేసి చూపిస్తూ వారి అభినందనలు అందుకుంటున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఫ్యామిలీకి  చిరంజీవి సైరా సినిమా స్పెషల్ షో వేసి చూపించారు . చిరంజీవి జగన్ అపాయింట్ మెంట్ కోరటం వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. జగన్ సీఎంగా ఎన్నికైనందుకు చిరంజీవి శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం సైరా సినిమా అదనపు షోలకు అనుమతి ఇవ్వటంతో సీఎంకు చిరంజీవి కృతజ్ఞతలు చెప్పాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. 
 
 సైరా సినిమా సక్సెస్ గురించి జగన్ కు వివరించటంతో పాటు సీఎం జగన్ కు వీలైతే స్పెషల్ షో వేయాలనే ఆలోచనలో కూడా చిరంజీవి ఉన్నట్లు సమాచారం. సీఎం జగన్ చిరంజీవి సమావేశం అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో ఆసక్తిదాయకంగా మారే అవకాశం ఉంది. చిరంజీవికి సీఎం జగన్ ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తారు? వీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది కేవలం సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి మాత్రమే చిరంజీవి జగన్ ను కలవబోతున్నాడని వీరిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు ఉండబోవని తెలుస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: