జగన్ ప్రమాణ స్వీకారం రోజున పరిపాలన ఎలా ఉండాలో .. ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని జగన్ ప్రజలకు చెప్పారు. సరిగా మూడే మూడు నెలలు ఎన్నో సంచలన నిర్ణయాలు ఇంత తక్కువ కాలంలో ఏ ప్రభుత్వం కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోదు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వాన్ని మనం చూశాము. ప్రతి విషయాన్ని సాగదీసి .. రాజకీయ లబ్ది కోసం పాకులాడేది. కానీ జగన్ మాత్రం ఇచ్చిన హామీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేస్తుండటం ఇప్పడూ రాష్ట్ర ప్రజల్లో జగన్ కు మైలేజ్ తీసుకువస్తుంది. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలు జగన్ వెంట వెంటనే అమలు చేస్తూ తాను మాట తప్పే వ్యక్తిని కాదని నిరూపిస్తున్నారు. దీనితో ఏపీలో ప్రతి పక్షాలకు పని లేకుండా పోతుంది. 


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అయిన టీడీపీ .. ఉద్యోగులను మభ్య పెట్టి చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు వారిని పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదనపు ఆర్ధిక భారం పడుతుందని బాబు భావించి ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది.


దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దాలుగా ఏ సీఎం తీసుకోని నిర్ణయం జగన్ తీసుకోవటంతో అందరూ జై జగన్ అంటూ మీడియ ముందు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టే మద్యపాన నిషేధం దశల వారీగా విధించడానికి చర్యలు మొదలుపెట్టారు. తోలి విడతలో ప్రభుత్వం అన్ని ప్రవైట్ లైసెన్సులను రద్దు చేసి .. వైన్ షాపులను తమ ఆధీనంలోకి తీసుకుంది. మునుపటి కంటే మధ్యం దుకాణాలు బాగా తగ్గిపోయాయి. దీనితో అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. నిజంగా ఇది జగన్ సాధించిన విజయంగా చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: