ఎంపీడీవోపై దౌర్జన్యం చేసారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత కూన రవికుమార్ అఙాతం వీడబోతున్నారని తెలుస్తుంది. బెయిల్ కోసం కూన రవికుమార్ హైకోర్టును ఆశ్రయించటం జరిగింది. ఆగష్ట్ 27 వ తేదీ నుండి కూన రవి కుమార్ అఙాతంలో ఉన్నారు. ఎంపీడీవోపై దౌర్జన్యం చేసారనే కేసులో రవికుమార్ తో పాటు మరో 11 మందిపై కేసులు పోలీసులు నమోదు చేసారు. 
 
10 మంది లొంగిపోయినప్పటికీ రవికుమార్ మాత్రం ఇప్పటికీ అఙాతంలోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సంచనలంగా మారిన ఈ కేసులో ఈరోజు రవికుమార్ అఙాతం వీడబోతున్నారని తెలుస్తుంది. ఆగష్ట్ 27 వ తేదీన కూన రవికుమార్ పై కేసు నమోదు అయింది. పోలీస్ బృందాలు రవికుమార్ కోసం గాలిస్తున్నాయి. కూన రవికుమార్ ఇంట్లో పోలీసులు వెతికినా ఆయన దొరకలేదు. 
 
హైకోర్టులో బెయిల్ కోసం రవికుమార్ ఆశ్రయించటంతో బెయిల్ వచ్చే అవకాశం ఉందని రవికుమార్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అందువలన కూన రవికుమార్ అఙాతం వీడి బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఒకవేళ బెయిల్ లభిస్తే మాత్రం టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నారని తెలుస్తుంది. కూనరవికుమార్ తో పాటు అఙాతంలో ఉన్న మరో వ్యక్తి కూడా ఈరోజు అఙాతం వీడే అవకాశం ఉందని సమాచారం. 
 
కూన రవికుమార్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని  తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. కూన రవికుమార్ అఙాతంలో ఉండటంతో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేయటం కూడా జరిగింది. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు కేసు నమోదు చేసారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేయటం జరిగింది. ఈ కేసులో ఉద్యోగులు మంత్రి పెద్దిరెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వటం కూడా జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: