వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి నేటికీ సరిగ్గా 100 రోజులు అవుతుంది. దీంతో ప్రతి వార్త పత్రికలో, వెబ్ సైట్ లో, సోషల్ మీడియాలో 100 రోజుల పాలనా గురించి పెద్ద ఎత్తున స్టోరీలు ప్రచురితమైతున్నాయి. జగన్ 100 రోజుల పాలన అంటూ వచ్చిన కొన్ని స్టోరీల్లో జగన్ దేవుడు అయితే మరికొన్ని స్టోరీల్లో జగన్ కు వ్యతిరేకంగా రాసి రక్షేషుడిని చేశారు. 


అయితే ఈ పత్రికలో మాత్రం జగన్ కి మద్దతు ఇవ్వట్లేదు ఆలా అని వ్యతిరేకంగాను రాయడం లేదు. కానీ అతని పాలనా ఎంత అద్భుతంగా ఉంది అనేది మాత్రమే ఇక్కడ ఉంది. వైఎస్ జగన్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్ల ప్రజలు ఎంతో లబ్ది పొందారు. అతను తీసుకున్న సంచలన నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు సంచలనం సృష్టించిన నిర్ణయాలే. 


ప్రతిపక్షం సైతం ఒకసారి జగన్ మోహన్ సంచలన ముఖ్యమంత్రి అన్న రోజులు ఉన్నాయి. ప్రతిపక్షానికి చోటు లేకుండా అయన సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అయన పాలన బాలేదు అని అన్న వారికోసం అతను తీసుకున్న సంచలన నిర్ణయాల చిన్న చిట్టి ఇది. కేవలం 100 రోజుల్లో తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవి. 


అంగన్‌వాడి, ఆశావర్కర్లకి ఒకేసారి భారీ జీతాలు పెంపు. 


పిల్లల్ని చదివించే తల్లికి ఏడాదికి 15 వేలు జనవరి 26 నుంచి ఈ పథకం అమలవుతుంది.


రైతుభరోసా పథకం ద్వారా 12 వేల 500 రూపాయలను అక్టోబర్ 15 నుంచి ఇవ్వనున్నారు.


ఈ నెల నుంచే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు.


2 వేల నుంచి 2వేల 250 రూపాయల పింఛన్ల ఫైల్‌పై మొదటి సంతకం పెట్టి అమలు చేస్తున్నారు. 


గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చారు.  


గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించి లక్ష పదహారువేలమందికి ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. 


కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం కమిటీని నియమించారు. 


పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచారు. 


తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశారు. 


ఘాతమలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఉన్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: