పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. 2018లో ఓ వికలాంగుడిని నిర్బంధించి కొట్టాడన్న కేసులో చింతమనేని గతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చింతమనేనిని కోర్టులో హాజరుపరచగా అక్టోబర్ 10 వరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.

 


ఇప్పటికే ఓ ఎస్సీ, ఎస్టీ కేసులో ఏలూరు జైల్లో రిమాండ్ లో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను ఇప్పుడు ఈ కేసు విషయంలో కోర్టులో హాజరుపర్చారు. పీటీ వారెంట్‌పై చింతమనేనిని పోలీసులు కోర్టులో హాజరుపర్చినట్టుగా సమాచారం. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించాడని చింతమనేనిపై ఆరోపణల నేపథ్యంలో ఏలురులోని జిల్లా కోర్టులో హాజరుపరిచారు. 2018లో ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని వద్దకు వెళ్లిన ఓ దివ్యాంగుడు తనకు న్యాయం చేయాలని కోరగా అతనిపై దాడి చేసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. వికలాంగుడు ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుపై చింతమనేనిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే చింతమనేనిపై 30కి పైగా కేసుల వరకూ పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. వీటన్నింటిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేశారు. కానీ ఇప్పటివరకూ చింతమనేని రెండు కేసుల్లోనే రిమాండ్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ కేసులపై కూడా చింతమనేనిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉందని అంటున్నారు.

 


టీడీపీ హాయంలో చింతమనేని ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉండేవారు. సాక్షాత్తూ ఓ మహిళా అధికారి విషయంలో 2015లో జరిగిన వివాదం అప్పట్లో తీవ్ర సంచలనమైంది. టీడీపీ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ చింతమనేని టీడీపీపై ఒకింత అసహనం కూడా వ్యక్తం చేసి ‘నేనే ఓ పార్టీ పెట్టేస్తా..’ అని కూడా అన్నారు. మరోసారి రాజధానిలో ఆవులకు గడ్డి మేపుతూ వార్తల్లో నిలిచారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: