end
=
Wednesday, June 12, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీలో మహిళలకు కీలక పదవులు
- Advertisment -

బీజేపీలో మహిళలకు కీలక పదవులు

- Advertisment -
- Advertisment -

వెబ్‌డెస్కు :  బీజేపీ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి జాతీయ నాయకత్వంలో పలువురు కొత్త వారికి చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఇక ఏపీకి చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక పదవి అప్పగించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో ఆమెకు చోటు కల్పించింది.

తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు

ఇక ఏపీకి చెందిన సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శుల జాబితాలో చోటు దక్కగా తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన లక్ష్మణ్‌ను బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు డీకే అరుణ. తనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటానని ఆమె పార్టీ నాయకత్వానికి చెబుతూ వచ్చారు.

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -