బాలయ్య హీరో మాత్రమే.. నోరు అదుపులో పెట్టుకోవాలి.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

బాలయ్య హీరో మాత్రమే.. నోరు అదుపులో పెట్టుకోవాలి.. నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
x
Nagababu, Balakrishna (File Photo)
Highlights

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఫైర్ అయ్యారు.

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఫైర్ అయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్‌లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలవబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బాలకృష్ణ మాట్లాడుతూ.. చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని తెలిపారు. ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను భూములు పంచుకోవడం అనడం తప్పు అని సి కళ్యాణ్ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు నాగబాబు కూడా బాలయ్యకు కౌంటర్ ఇచ్చాడు. బాలకృష్ణ నోరు జారొద్దు.. అదుపులో పెట్టుకోవాలంటూ కౌంటర్ వేశాడు. ఈ సమావేశానికి ఎవర్ని పిలవాలో.. ఎవర్ని పిలవకూడదో కమిటీకి తెలుసు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. భూములు పంచుకుంటున్నారని బాలయ్య చేసిన వ్యాఖ్యలు బాధాకరం అని నాగబాబు అన్నారు . దాంతో పాటు ఈ వ్యాఖ్యలను వెంటనే బాలయ్య వెనక్కి తీసుకోవాలని కోరాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని హితవు పలికాడు నాగబాబు. బాలయ్య మాట్లాడిన మాటలు సరైనవి కాదని అన్నారు.

బాలయ్య సినీ పరిశ్రమనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్నీ అవమానించారంటూమెగా బ్రదర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం, పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసాడు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎవరు చేశారో.. ఏపీని ఎవరు సర్వనాశనం చేశారనేది అందరికీ తెలుసని నాగబాబు ఆరోపించారు. బాలకృష్ణ ఇండస్ట్రీకి ఆయనేం కింగ్ కాదు హీరో మాత్రమే అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. గతంలో కూడా ఓ సారి బాలయ్య ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories